జడ్పీ పాఠశాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

పులివెందుల, ఆంధ్రప్రభ: మండలంలోని నల్లపురెడ్డిపల్లె ప్రభుత్వ జడ్పీ పాఠశాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సహచర మంత్రి ఎస్. సవిత, టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, సిలబస్‌ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలోని ప్లేగ్రౌండ్ అభివృద్ధి, బోర్‌వెల్‌కు మోటార్ ఏర్పాటు, పైప్ కనెక్షన్లు, హాస్టల్‌లో ఓపెన్ డార్మిటరీ వంటి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కిచెన్‌ను పరిశీలించిన మంత్రి.. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూశారు.

విద్యారంగంలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.