శారాజీపేటలో సర్పంచ్‌ మార్నింగ్‌ వాక్‌

ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలపై ఆరా

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటలో సర్పంచ్‌ కంతి మధు మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. గ్రామంలో ప్రజలను కలుస్తూ ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న ఇబ్బందులతో పాటు ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.