మార్చి నాటికి బందరు పోర్టు పూర్తి చేస్తాం

  • నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు 95 శాతం పూర్తి
  • బందరు పోర్టు చారిత్రక వారసత్వాన్ని కాపాడుతామన్న మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా  ప్రజల చిరకాల  వాంఛ  అయిన  మచిలీపట్నం  పోర్టు  మార్చి  నాటికి  నాలుగు  బెర్తులతో   మళ్లీ వెలుగులీననుందని రాష్ట్ర  గనులు  భూగర్భవనలు  ఎక్సైజ్  శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి సంబంధించి 4 బెర్తు నిర్మాణాలు పూర్తికాపోతున్నాయన్నారు అలాగే నార్త్,సౌత్ మౌత్ వాటర్ బ్రేక్ పనులు కు సంబంధించిన పనులు 95 శాతం మేర పూర్తయ్యాయి అన్నారు

 ఈ పనులన్నీ సకాలంలో పూర్తి కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు  ఎంతో  చాకచక్యంతో వ్యవహరించారన్నారు. మచిలీపట్నంతో పాటు కృష్ణాజిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన బందరు పోర్టు నిర్మాణం పూర్తి కావడం ఎంతో హర్షణీయమన్నారు

 స్వాతంత్రానికి పూర్వం ఎంతో గొప్పగా వెలుగొందిన బందరు పోర్టు తదనంతరం ప్రభావం తగ్గుకుంటూ వచ్చిందని తుదకు మూతపడిన పోర్టు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయన్నారు

 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోర్ట్ నిర్మాణం కోసం చేసిన ప్రయత్నాలు నేడు సఫలీకృతం అవుతున్నాయన్నారు. 2019 -24 కాలంలో నిర్లక్ష్యానికి గురికాగా తిరిగి 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్ల కాలంలో పనులు వేగవంతంగా సాగాన్నారు .ఫలితంగానే పోర్ట్ నిర్మాణ పనులు తుది దశకు చేరాయన్నారు. 2027 మార్చి జూన్ మధ్య పోర్టు ప్రారంభానికి సన్నాహాలు చేస్తామన్నారు

 బందరు పోర్టుపై రోజుకో నాటకమాడిన స్థానిక వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని   పోర్టును గోగిలేరుకు తరలించేందుకు జరిగిన కుట్రలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు పేర్ని నాని పాత్రదారుడయ్యారన్నారు 

బందర్ పోర్టు కృష్ణాజిల్లా కే కాక అమరావతికి తలమానికం కాబోతుందన్నారు హైదరాబాదుకు సమీపంలో ఉన్న మచిలీపట్నం పోర్టును సద్వినియోగం చేసుకునేందుకు ఆ రాష్ట్రం ఎంతో ఉత్సాహంతో ఉందన్నారు. ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే దిశగా ప్రయత్నాలు  జరుగుతున్నాయన్నారు. పోర్టుకు  అనుసంధానంగా రైల్వే, రోడ్డు కనెక్టివిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు‌

 వీటికి అదనంగా నార్త్ లో మరో రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల కేంద్రంలో సంబంధిత అధికారులు మంత్రులతో చర్చించడం జరిగిందన్నారు. ఇప్పటికే కోర్టుకు అనుబంధ పరిశ్రమలు నెలకొల్పేందుకు అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయని తద్వారా మచిలీపట్నం తో పాటు పరిసర ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందుతాయన్నారు.మొత్తంగా మచిలీపట్నం మరోసారి వెలగబోతుందని మంత్రి రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు.