జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ…
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట మండలం ధర్మ తండాలో అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, హాజరు, మౌలిక వసతులను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు.
అనంతరం జగ్గయ్యపేట పట్టణంలోని గ్రోమోర్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గ్రోమోర్లో ఎరువులు, విత్తనాల నిల్వలు, రైతులకు అందుతున్న సేవలు, రికార్డులను పరిశీలించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు బాయ్స్ హైస్కూల్లో నిర్వహించిన తిరంగా జెండా ర్యాలీలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానికులు పాల్గొన్నారు.
