బీర్పూర్ తహసీల్దార్ ఆఫీస్‌లో ఏసీబీ దాడి
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన గిర్దావర్ రాహుల్
జగిత్యాల / బీర్పూర్, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుండి రూ.30,000 లంచం తీసుకుంటుండగా గిర్దావర్ రాహుల్ ను ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.
