మంత్రి కె.వి.ఆర్ ప్రభుత్వ విప్, వేముల దిష్టిబొమ్మల దగ్ధం
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా నకరికల్లు నియోజకవర్గం చిట్యాల మండలం నేరడ గ్రామంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మలను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చిట్యాల మండల్ అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ… నార్కట్పల్లి మండలంలో రోడ్డు విస్తరణ పనులు గత మూడు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న సందర్భంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ప్రాణ నష్టం జరుగుతుందని బీజేపీ నాయకులు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి దీక్షను భగ్నం చేసి ప్రజల మేలు కోసం కొట్లాడే బీజేపీ నాయకులు అరెస్టులతో భయపెట్ట లేరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్ మండల ప్రధాన కార్యదర్శి ఉన్న విష్ణు మండల ఉపాధ్యక్షుడు నాగచారి మండల కార్యదర్శి వరుకుప్పల నరసింహ శక్తి కేంద్రం ఇంచార్జ్ గోపాలకృష్ణ వెంకటేశం నరేందర్ రమేష్ పాల్గొన్నారు.
