సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటం..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం చేస్తామని (యు.ఎస్.పి.సి) ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి సంఘ నాయకులు ముడుగు స్వాముల్ , స్వామి జంగు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు జరుగుతున్న దశల వారి పోరాటంలో భాగంగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం డిప్యూటీ తాసిల్దార్ అమృత్ లాల్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముడుగు శ్యాముల్, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆడ ప్రకాష్, వీరయ్య ,బి ప్రకాష్, మహిళ సంఘ నాయకురాలు రవిత, సంగీత, సుజాత, పంచపుల తదితరులు పాల్గొన్నారు.