Amaravati-Seed-Access-Road: ఇదే అమరావతి రాజమార్గం Andhra Prabha Top News
Amaravati-Seed-Access-Road: ఇదే అమరావతి రాజమార్గం Andhra Prabha Top News
- అభివృద్ధిఆలో తొలి మెట్టు ఎక్కాం
- సింధూనాగరికతే స్ఫూర్తి
- ఏపీ సీఎం చంద్రబాబు
( ఆంధ్రప్రభ, అమరావతి )

అమరావతి రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చేసింది . అమరావతి నగర నిర్మాణంలో ఇది ప్రారంభం మాత్రమే. మూడో దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్టు అవుతుంది ,అమరావతి రాజధాని పూర్తి కాలుష్య రహిత నగరంగా మారుతుంది. డీప్ టెక్ క్యాపిటల్ గా దీనిని తయారు చేస్తున్నాం. అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.తాడేపల్లిలో గురువారం సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఏఐ, క్వాంటం కంప్యూటర్ వ్యాలీగా అమరావతి మారుతుంది. టాప్ 5 నగరాల్లో ఒకటిగా తయారవుతుంది అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని పరిధిలోనే ఉంటాయి 190 కిలోమీటర్ల అవుటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగురోడ్డును కూడా కేంద్రం మంజూరు చేసింది 2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం సింధూ నాగరికత తరహాలోనే రాజధాని నగరంలో సీడ్ యాక్సెస్ రహదారులు నిర్మాణం జరుగుతున్నాయి ఇక అమరావతి అన్ స్టాపబుల్. రాజధాని లో నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు ఈ తరహా వ్యక్తులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం. రాష్ట్రాభివృద్ధి కోసం నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకుంటున్నాం 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్ర చేయాలన్న సంకల్పం తీసుకున్నాం. మరి మీరు ఏం సంకల్పం చేస్తారు 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేతిలో జాతీయ జెండా, మనస్సులో అజెండాతో సాధించాల్సిన లక్ష్యాన్ని సంకల్పం చేయండి అనునిత్యం మీ సంకల్పాన్ని నెరవేర్చుకునే ఆలోచనలు చేస్తే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యం అవుతుంది. మనకు స్వాతంత్ర్యం ఎందుకు వచ్చిందో అంతా మర్చిపోతున్నాం. కేవలం జెండా వందనం ఒక్కటే కాదు దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టటం ముఖ్యం రైతులు, విద్యార్ధులు, కార్మికులు, వ్యాపారులు ఎవరైనా తమతమ ప్రాంతాల్లో కృషి చేయాలి ప్రతీ ఇల్లు,వాణిజ్య సంస్థ పైనా జాతీయ జెండా ఎగరాలి. మండల, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలి. ఓ ప్రజా ఉద్యమంగా తిరంగా ర్యాలీ జరగాలి. వచ్చే 21 ఏళ్లలో వికసిత్ భారత్ గా తయారు కావాలి 2047 నాటికి స్వర్ణాంధ్రగా ఏపీ తయారు కావాలి. ఆ శక్తి సామర్ధ్యాలను ప్రజలే అందించాలి. అమరావతి రాజధాని అభివృద్దికి ప్రజలూ ఆలోచనలు పంచుకోవాలి. అమరావతి ఆర్ధిక రాజధానిగా మారాలి. స్వాంతంత్ర్య దినోత్సవ స్పూర్తిని ప్రజలంతా అందిపుచ్చుకోవాలిసీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిలతో మొదటి మెట్టు ఎక్కాం. అని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
Amaravati-Seed-Access-Road: ఇదే రాజమార్గం

రాష్ట్రాభివృద్ధి విజన్‌కు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి సక్సెస్ తెలుగు జాతి గర్వపడేలా ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం జరిగింది. విభజన తర్వాత ఈ ప్రాంతం నష్ట పోయింది. రాజధాని కూడా లేకుండా పోయింది. 25 పార్లమెంటు స్థానాల్లో మధ్యలో గుంటూరు జిల్లా ఉంది. అందుకే రాజధానిని ఇక్కడ పెట్టాలని సంకల్పించాం. విస్తృత చర్చల తర్వాత మాపై విశ్వాసంతో రైతులు రాజధాని నిర్మాణం కోసం ముందుకు వచ్చారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను, సీఎం బావెద్వేగంతో అన్నారు.
Amaravati-Seed-Access-Road: ఎగతాళి చేశారు
సింగపూర్ అమరావతి బృహత్ ప్రణాళికకు పూర్తిగా సహకరించింది. అలాంటి సింగపూర్‌ను గత పాలకులు వేధింపులకు గురిచేశారు. ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను యూనీక్‌గా ఉండాలని లండన్‌కు చెందిన నార్మన్ ఫాస్టర్స్‌తో డిజైన్లు చేయించాం కొందరు గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేశారు. ఆ గ్రాఫిక్స్ నిజం అవుతుంటే ఎగతాళి చేసిన వాళ్లంతా తల దించుకోవాలి . అమరావతితో పాటు అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి వికేంద్రీకరించేలా ప్రణాళికలు చేశాం అసెంబ్లీలో రాజధాని నిర్మాణానికి 40 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి తర్వాత మూడు రాజధానులు అని మాటతిప్పేశాడు 2019-24 మద్య రైతుల ఉద్యమాన్ని చరిత్ర మర్చిపోదు. ఆ ఉద్యమానికి మేం కూడా జోలె పట్టి రైతులకు సహకరించాం అమరావతి రాజధాని నిర్మాణానికి దేశంలోని పవిత్ర నదులు, ప్రాంతాల ఆశీర్వాదం కోసం నీరు, మట్టిని తెప్పించి ఇక్కడ కలిపాం తిరుమల తర్వాత అంతటి విశిష్టమైన శ్రీవారి ఆలయం అమరావతిలో ఉండాలని ఆకాంక్షించాను అమరావతితో పాటు రాష్ట్రం అంతటా అభివృద్ధి కావాలన్నదే నా ఆకాంక్ష హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ కావాలన్నదే నా ఆకాంక్ష. అమరావతిని ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం, అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Amaravati-Seed-Access-Road: అవన్నీ అపోహలే
రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులపై అధికారిక వివరణ రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ అధికారిక వివరణను విడుదల చేస్తోంది.
సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్–3లో భాగంగా విజయవాడ–చెన్నై జాతీయ రహదారి (NH–16)ను మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే ప్రధాన రహదారి కారిడార్ నిర్మించాల్సి ఉంది. భవిష్యత్‌లో చేపట్టనున్న ఈ కారిడార్ నిర్మాణానికి అనుగుణంగా, అవసరమైన భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానాలు, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం చేపట్టాం. రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు, కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యంగా సీడ్ యాక్సెస్ రహదారిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందువల్ల సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులను భవిష్యత్ రహదారి కారిడార్ నిర్మాణం, అనుసంధాన అవసరాలు, సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగంగా చూడాలి. వీటిపై వస్తున్న అసత్య ప్రచారాలు, అపోహలకు ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేస్తున్నాం. ప్రజలు ఈ అంశంపై వాస్తవాలను గమనించి, అసత్య ప్రచారాలను నమ్మకుండా, అపోహలకు గురికావద్దని ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేస్తోంది. అని సీఎం సీబీఎన్ వివరించారు.
