నాగదేవత మందిరంలో జాతీయ జెండా ఆవిష్కరణ
వికారాబాద్, ఆంధ్రప్రభ : హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలయ ప్రాంగణంలోని శ్రీ నాగదేవత మందిరంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆలయ నిర్వాహకులు, మాజీ కౌన్సిలర్ బరాడి రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బరాడి రమేష్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలు ఉత్సాహంగా నిర్వహించాలని కోరారు.
