హుస్సేన్‌తో ప్రత్తిపాటి శ్రీధర్ మర్యాదపూర్వక భేటీ
భవానీపురం, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియమితులైన దుర్భేసుల హుస్సేన్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి శ్రీధర్ హుస్సేన్‌ను దుశ్శాలువతో సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. హుస్సేన్ నూతన బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రీధర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హుస్సేన్ వెంట ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు దుర్భేసుల మీరావలి ఉన్నారు.
