బూతుమల్లిలో ఇంటింటా సంక్షేమ పథకాల ప్రచారం

వేమూరు, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా వేమూరు మండలంలోని బూతుమల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేత నక్కా ఆనందబాబు గ్రామంలోని ఇళ్లకు వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ పథకాలపై వివరించారు.

‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో చేపట్టిన ఈ ప్రచారంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం–2, ఎన్టీఆర్‌ భరోసా, సూపర్‌ సిక్స్‌ తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వివిధ వర్గాలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడమే కార్యక్రమం ఉద్దేశమని ఆనందబాబు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్లినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆనందబాబు తెలిపారు.