చెన్నూరులో పోలీసుల విస్తృత తనిఖీలు
చెన్నూర్, ఆంధ్రప్రభ : నాటుసారా, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తుపదార్థాల నియాత్రణ లో భాగంగా మంగళవారం స్థానిక పోలీసులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్స్ విస్తృత తనిఖీలు చేపట్టారు. 63వ జాతీయ రహదారి పరిసర ప్రాంతాలలోని అనుమానిత హోటల్స్, పాన్ షాప్లలో తనిఖీ లు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ఎస్సై రాజశేఖర్ ఈ సందర్బంగా అన్నారు.
