కొలనుపాక సోమేశ్వరాలయంలో ఘనంగా మహా ప్రదక్షణ

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కొలనుపాక శ్రీ సోమేశ్వరాలయంలో సోమవారం మహా ప్రదక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మహా ప్రదక్షణలో పాల్గొని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ ప్రతినిధులు, అర్చక స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.