మోత్కూర్‌లో ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలు

మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌ మున్సిపల్‌ కేంద్రంలో యూత్‌ కాంగ్రెస్‌ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎరసానిపల్లి సందీప్‌, ఉపాధ్యక్షుడు అవిశెట్టి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మాజీ యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి, కౌన్సిలర్‌ కారుపోతుల వెంకన్నగౌడ్‌, మండల ప్రధాన కార్యదర్శి జినుకల కనకయ్య, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు మెంట నగేష్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు బండారు ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు మహమ్మద్‌ షాకిరుద్దీన్‌, మండల యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు అవిశెట్టి మధు, బీసు రాహుల్‌, అన్నెపు సురేష్‌, బుర్ర శ్యాంప్రసాద్‌, సాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.