రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా మరోసారి ఆంక్షల అస్త్రం

రష్యా చమురు, గ్యాస్‌పై వంద శాతం సుంకాలకు సిద్ధం

భారత్‌ ఇంధన కొనుగోళ్ల హక్కుపై అమెరికా ఒత్తిడి

ఇరాన్‌ యుద్ధంపై ట్రంప్‌కు స్వదేశంలో వ్యతిరేకత

భారతీయ విద్యార్థులకు పెరుగుతున్న వీసా కష్టాలు

ఆంక్షల విషయంలో అమెరికా మళ్ళీ పాత పాటనే అందుకుంది. రష్యా వద్ద చమురు, గ్యాస్ కొంటే వంద శాతం ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరిక చేసింది. ఇందుకు సంబంధించి అమెరికన్ సెనేట్ అధ్యక్షునికి సర్వాధికారాలు ఇస్తూ బిల్లును ఆమోదించింది. ఇటీవల మరణించిన సెనే టర్ లిండ్సే గ్రాహమ్ పేరిట ఈ బిల్లును తీసుకుని వచ్చింది. ఈ బిల్లును ఈ 86-11ఓట్లతో ఆమోదించింది. సెనేట్ ఆమోదించిన ఈ బిల్లును ప్రతిని ధుల సభ కూడా ఆమోదిస్తే చట్ట రూపం దాల్చనున్నది. ఆగస్టు 31వ తేదీ న ఈ బిల్లు ప్రతినిధుల సభ ఆమోదానికి రానుంది. అక్కడ కూడా ఆమో దం పొందితే, అధ్యక్షుని సంతకంతో ఇది చట్ట రూపం దాల్చనున్నది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనవద్దని అమెరికా చాలా కాలంగా ఒత్తిడి తెస్తున్నది. ఉక్రెయిన్తో రష్యా జరుపుతున్న యుద్ధాన్ని ముగించేట్టు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాపై ఆంక్షల కోసం పట్టుపడు తున్నారు. నిజానికి మన దేశం ఎక్కడ ఇంధనం చౌక ధరకు దొరికితే అక్కడ కొనుగోలు చేసేందుకు హక్కు ఉంది. ఆ హక్కును కాలరాయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్తో చర్చల్లో పలుసార్లు ప్రస్తావన చేశారు. అయితే, ట్రంప్ అంతర్గత సమస్యలనుంచి బయటపడటానికి ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు తెరమీదికి తెస్తున్నారు. మన దేశం పైనే కాకుండా రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై నూరు శాతం సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షునికి ఈ బిల్లు అధికారం ఇస్తుంది. ఇది చట్టరూపం ధరిస్తే, మన దేశమే కాకుండా, స్లొవేకియా, హంగేరీ, అజర్ బైజాన్లపై కూడా తీవ్రమైన భారం పడను న్నది. గతంలో ఈ టారిఫ్ని ట్రంప్ ప్రభుత్వం 500 శాతంగా నిర్ణయిం చింది. తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వంటి పరిణామాలతో వెనక్కి తగ్గింది. ట్రంప్ ఇరాన్పై చేస్తున్న యుద్ధం పట్ల స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సంయుక్త దళాల జాయంట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ డాన్ కేన్ సలహా ఇచ్చారు. అమెరికాలో పలు నగరాల్లో ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వాదులు ప్రదర్శనలు జరుపుతు న్నారు. అయితే, ఎవరి మాట వినని ట్రంప్ ఇప్పుడు దేశంలో రక్షణ శాఖ ఆయుధాగారంలో క్షిపణుల సంఖ్య తగ్గిపోవడంతో పునరాలోచనలో పడినట్టు వార్తలు వచ్చాయి. ఇరాన్ యుద్ధం నుంచి బయటపడాలనీ, లేని పక్షంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వాన్ని డాన్ కేన్ హెచ్చరించినట్టు తెలియవచ్చింది. అంతేకాక, సైన్యంలో కూడా చాలా మంది తమ కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న దృష్ట్యా, యుద్ధాన్ని విరమించాలని కోరుతు న్నట్టు తెలుస్తోంది. కాగా, అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్ధులకు నిరాశ కలిగించే రీతిలో ట్రంప్ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. చైనాతో పోలిస్తే భారతీయ విద్యార్ధుల స్టూడెంట్ వీసా నిరాకరణలు రెట్టింపు ఉండటం ఇందుకు నిదర్శనం. అయితే, వీసాలు తగ్గినప్పటికీ, అమెరికా విద్యా సంస్థల్లో తమ పేర్లను నమోదు చేసుకుం టున్న విద్యార్ధుల్లో భారతీయ విద్యార్ధులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికే సోషల్ వెట్టింగ్, తదితర ఆంక్షల వల్ల భారతీయ విద్యార్ధులు సతమతమమతున్న వేళ ఇప్పుడు స్టూడెంట్ వీసాలను తగ్గించడం వల్ల విద్యార్ధులు మరిన్ని కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు.