ఓవర్‌మెన్‌ సమస్యలు పరిష్కరించాలి

  • ఎమ్మెల్యే గండ్రకు ఓవర్‌మెన్‌ ఉద్యోగుల వినతి

భూపాలపల్లి టౌన్‌, ఆంధ్రప్ర‌భ‌ : ఓవర్‌మెన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసి వినతిపత్రం అందజేశారు. మైనింగ్‌ స్టాఫ్‌కు సంబంధించిన కేడర్‌ స్కీమ్‌ సవరణలు, పెండింగ్‌ పదోన్నతులు, జేఎంఈటీ ఉద్యోగుల సేవా సమస్యలు, డిప్లొమా హోల్డర్ల కెరీర్‌ పురోగతి, ఛార్జ్‌ అలవెన్స్‌ తదితర అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సింగరేణి డైరెక్టర్‌ (పా)తో ఫోన్‌లో మాట్లాడి వివరించారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. సమస్యలను పరిశీలించి 15 రోజుల్లో కమిటీ ఏర్పాటు చేస్తామని సింగరేణి డైరెక్టర్‌ హామీ ఇచ్చినట్లు రఘుపతి రెడ్డి తెలిపారు. కమిటీ సూచనల మేరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు.