వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి పల్లకి సేవ…
ఉరవకొండ రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ ): జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన పెన్నాహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున స్వామి వారి మూలవిరాట్ కు అభిషేకం, పుష్పాలతో, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరణ, అర్చనలు, పూజ కార్యక్రమాలను, మహా మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు.
భూదేవి శ్రీదేవి సమేతుడైన నరసింహ స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువదీర్చారు. భాజా భజత్రీల నడుమ స్వామి వారిని దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడిన తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సాకే రమేష్ బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, అర్చకులు మయూరం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న: సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని శనివారం సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు కలిసి దర్శించుకున్నారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన పేరిట ప్రధాన అర్చకులు ద్వారక నాథ్ చార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అర్చకులు స్వామివారి విశిష్టతను వివరించారు. కలెక్టర్ కు సన్మానించి, సత్కరించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
