జన్మదిన వేళ చంద్రబాబు ఆశీస్సులు..

  • పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్నకు ఆత్మీయ అభినందనలు
  • కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన
  • టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న

(విజయవాడ, ఆంధ్రప్రభ) : తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న తన జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు తీసుకున్నారు. జన్మదినం సందర్భంగా బుద్ధా వెంకన్నకు చంద్రబాబు ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు.

చంద్రబాబు నాయుడిని బుద్ధా వెంకన్న దైవ సమానులుగా భావిస్తూ ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలుసుకుని ఆశీస్సులు తీసుకోవడం తన జన్మదిన వేడుకల్లో ప్రత్యేక సందర్భంగా నిలిచిందని తెలిపారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.