అపూర్వ స‌మ్మేళ‌నం

52 ఏళ్ల తర్వాత క‌లిసిన పూర్వ విద్యార్థులు

భూత్పూర్, ఆంధ్రప్రభ :1974 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం భూత్పూర్‌లోని స్థానిక కేఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. సుమారు 52 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకోవడంతో కార్యక్రమం సందడిగా సాగింది.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి పాఠశాల రోజులు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.గురువులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయంగా ముచ్చటిస్తూ, భవిష్యత్‌లోనూ ఇలాంటి సమావేశాలను నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో 1974 బ్యాచ్‌కు చెందిన పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.