ఉరవకొండలో చేనేతల భారీ ర్యాలీ… థాంక్యూ సీఎం..
సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల
కేశవ్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్ర పటాలకు పాలాభిషేకం
ఉరవకొండ రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేతల జీవితా ల్లో వెలుగు నింపేందుకు, చేనేతల వారి అకౌంట్లోకి నగదును జమ చేశారు. దీనితో ఉరవకొండ పట్టణం లో చేనేతలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చేనేతలు థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా పట్టణం లోని చేనేతలు, టిడిపి నాయకులు చౌడేశ్వరి కాలనీ నుండి బయలుదేరి పార్క్ ఆంజనేయస్వామి గుడి, బళ్లారి రోడ్డు మీదగా టవర్ క్లాక్, కవిత హోటల్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐ.టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉరవకొండ మాజీ వైస్ ఎంపీపీ పెద్దకోట్ల రాజేష్ మాట్లాడుతూ ఎంతో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, చెప్పిన మాట ప్రకారం చేనేతలకు ఆదుకోవాలని ఉద్దేశంతో 71,536 మంది చేనేతలకు వారి వారి అకౌంట్లోకి నగదు జమ చేశారన్నారు.
చేనేతలకు అందించినటువంటి, ఈ సహాయం మరువలేనిదని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వ మని నిరూపించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రం లోని చేనేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు రుణపడి ఉంటామన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్, మండల టిడిపి కన్వీనర్ మోపిడి గోవిందు, పట్టణ టిడిపి కన్వీనర్ రామాంజనేయులు, పీఏసీ చైర్మన్ ప్యారం కేశవానంద, వాసుదేవ, శంకర్ సుదర్శన్, చందా రాము, పల్లా నరసింహులు, నిమ్మల ప్రసాద్, చిట్టా రఘు, బీరే శేఖర్, గమ్ము ప్రభాకర్, బెస్త రమేష్, చంగల అమరేష్, చంగల వీరేష్ చంగల మోహన్, పల్లహరి,రాజు, నాగ భూషణం, ప్రసాద్, రవి, కటికం నాగరాజు, రామకృష్ణ, ఇంద్రావతి సుధాకర్, ప్యాపిలి నాగన్న పాల్గొన్నారు.
