Rs-80-Lakh-Dispute: రూ.80 లక్షలు ఎగనామం Andhra Prabha Top News
Rs-80-Lakh-Dispute: రూ.80 లక్షలు ఎగనామం Andhra Prabha Top News
- గిరిజనులు రోడ్డుపాలు
- కాంట్రాక్టు పని చేయించి..
- ఫ్రతిఫలం ఇవ్వని గుత్తేదారు
- మంత్రి కొల్లు అనుచరుడిపై ఆరోపణ
- న్యాయం కోసం పాదయాత్ర
- కనకదుర్గమ్మకు ఫిర్యాదు
- లంబాడీలు వినూత్న నిరసన
- ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ జామ్

(ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ)
Rs-80-Lakh-Dispute: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు రాజా తమతో పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపిస్తూ జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామ బంజారా గిరిజనులు శుక్రవారం ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ కనకదుర్గ గుడికి పాదయాత్ర చేపట్టారు. మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు. పాదయాత్రలో దుర్గమ్మ ఫొటో, సారె ప్రదర్శించారు. సంప్రదాయ లంబాడీ దుస్తుల్లో ప్ల కార్డులు చేతపట్టి మంత్రి కొల్లు అనుచరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మంత్రి అనుచరుడు రాజా తమతో కాంట్రాక్టు పనులు చేయించుకుని సుమారు రూ.80 లక్షలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు చెల్లించమని అడిగితే తాను మంత్రి కొల్లు అనుచరుడినని, డబ్బులు ఇవ్వను.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల పాదయాత్రకు సీపీఎం మండల కార్యదర్శి ఎం.మహేష్ సంఘీభావం
