Russia-Massive-Attack : కీవ్.. కెవ్వు కేక Andhra Prabha Top Story
Russia-Massive-Attack : కీవ్.. కెవ్వు కేక Andhra Prabha Top Story
- రష్యా భీకర దాడి
- 24 బాలిస్టిక్ క్షిపణుల వర్షం
- 17 మంది పౌరులు మృతి
- ఆర్థిక మూలాలు ధ్వంసం
- ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి
- సాయం కోసం మిత్రదేశాలకు అధినేత వినతి
(ఆంధ్రప్రభ, కీవ్ (ఉక్రెయిన్)
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇరు దేశౄలు. జనవాసాలను టార్గెట్ చేసుకుని దాడులు, ప్రతిదాడులు చేస్తున్నాయి. జనం రద్దీగా ఉండే దక్షిణ రష్యాలోని బీచ్ పై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం కురిపించగా ఏడుగురు దుర్మరణం చెందితే.. అందుకు ప్రకీకారంగా రష్యా చెలరేగిపోయింది. ఉక్రెయిన్ రాజధానిపై ఖండాంతర క్షిపణులతో బీకర దాడి చేసింది. 17 మంది పౌరులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇక వాణిజ్య కేంద్రాలరూ రష్యాకూల్చివేసింది. రష్యా క్షిపనణులను అడ్డుకునే సామర్థ్యం లేక పోవటంతో.. ఇప్పుడు ఉక్రెయిన్ అధినేత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తక్షణమే ఆయుధ సామాగ్రి కోసం మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. అసలు ఏమి జరిగిందటే..
Russia-Massive-Attack రష్యా భీకర దాడి
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం పరిసర ప్రాంతాలలో రాత్రికి రాత్రే రెండు డజన్లకు పైగా బాలిస్టిక్ నౌకా విధ్వంసక క్షిపణులను రష్యా ప్రయోగించింది. ఈ దాడిలో 17 మంది మరణించారు పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ క్షిపణులలో ఏ ఒక్కటీని ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థల అడ్డుకోలేక పోయింది. ఇప్పటికే క్షిపణి నిరోధకాల నిల్వలు అత్యంత తక్కువగా ఉండటంతో ఉక్రెయిన్ సతమతమవుతోంది. తాజా దాడితో కీవ్ నగర ప్రాణగండం పొంచి ఉందని ఈ దాడి స్పష్టం చేస్తోంది.
Russia-Massive-Attack ఉక్రెయిన్ అధిపతి ఉక్కిరి బిక్కిరి
రష్యా క్షిపణులను కూల్చివేయడానికి అవసరమైన సైనిక పరికరాలను తమకు అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరోసారి తమ మిత్రదేశాలకు పిలుపునిచ్చారు.
“బాలిస్టిక్ నిరోధక వ్యవస్థలను అందించడంలో జాప్యం లేదా వాటిని ఇవ్వడానికి విముఖత చూపడం వంటివి కచ్చితంగా ఇంతటి భయంకర ప్రాణనష్టానికి, విధ్వంసానికి దారితీస్తాయని భాగస్వాములు గ్రహించడం చాలా కీలకం,” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “ప్రస్తుతం నిరోధకాల సరఫరా విషయంలో మరింత చురుకుగా సహాయం చేయడానికి సిద్ధంగా లేని భాగస్వాములు, కొత్త ఆంక్షలు విధించడం తో సహాయపడగలరు.ష మరిన్ని ఇంటర్‌సెప్టర్ క్షిపణులను సమకూర్చుకోవడం గురించి తాను నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో మాట్లాడినట్లు జెలెన్స్కీ తెలిపారు. “అవసర క్షిపణులు సహాయం చేయగల సామర్థ్యం ఉన్న దేశాల విషయంలో మేము మా ప్రయత్నాలను సమన్వయం చేసుకున్నాం,” అని ఉక్రేనియన్ నాయకుడు Xలో ఒక పోస్ట్‌లో రాశారు.
Russia-Massive-Attack వాణిజ్య కేంద్రాలు ధ్వంసం
ఈ దాడులతో ఉక్రెయిన్‌లోని ప్రముఖ వ్యాపారాలకు కూడా నష్టం వాటిల్లింది. వాటిలో దేశంలోని అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన రోజెట్కా, ఐకియాతో పోల్చదగిన రిటైల్ చైన్ లోని ఎపిసెంటర్ కూడా ఉన్నాయి. మూడు బాలిస్టిక్ క్షిపణులు ఒక గిడ్డంగి సముదాయంపై దాడి చేశాయని రోజెట్కా సహ యజమాని ఇరినా చెచోట్కినా, చెప్పారు. “నా జీవితకాలమంతా నేను చేసిన కృషి అంతా మంటల్లో కాలిపోవడాన్ని నిన్న రాత్రి చూశాను,” అని ఆమె ఫేస్‌బుక్‌లో రాశారు. ఎపిసెంటర్ ఒక ప్రకటనలో, రష్యా తమ తయారీ మౌలిక సదుపాయాలపై “వినాశకర దాడి” చేసిందని, ఈ దాడిలో తమ పురుష ఉద్యోగులలో ఒకరు మరణించారని పేర్కొంది. “కొన్ని నిమిషాల వ్యవధిలోనే, దశాబ్దాలుగా కంపెనీ నిర్మిస్తున్న దానిని రష్యా క్షిపణులు ధ్వంసం చేశాయి,” అని ఆ ప్రకటనలో తెలిపారు. సూపర్ మార్కెట్ గొలుసులను నిర్వహిస్తున్న ఉక్రెయిన్‌లోని అతిపెద్ద రిటైలర్లలో ప్రధాన ఫాజీ గ్రూప్, రష్యా షెల్లింగ్ కారణంగా తమ రెండు పంపిణీ కేంద్రాలలో మంటలు చెలరేగాయని తెలిపింది. ఈ దాడిలో తమ ఆరుగురు ఉద్యోగులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఆ సంస్థ పేర్కొంది.
Russia-Massive-Attack రష్యా ప్రతీకారం
రష్యా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో సమాన వైల్డ్‌బెర్రీస్‌పై ఉక్రెయిన్ ఇటీవల జరిపిన దాడులు, సాధారణ రష్యన్ల జీవితాలను, జీవనోపాధిని దెబ్బతీయడం ద్వారా ఉక్రెయిన్‌పై మాస్కో సాగిస్తున్న యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. వైల్డ్‌బెర్రీస్ దాడికి ప్రతిగా, ఉక్రెయిన్ రాజధాని మరియు దాని పరిసర ప్రాంతాల్లోని గిడ్డంగులు, లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని, బుధవారం తెల్లవారుజామున మాస్కో ఈ దాడి చేసింది. అత్యవసర సేవల నుండి అందిన చిత్రాంంలలో కీవ్ ప్రాంతంలోని అనేక పారిశ్రామిక భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. . “పౌర సంస్థల గిడ్డంగులు ఈ దాడికి ప్రధాన లక్ష్యాలు,” అని జెలెన్స్కీ తన టెలిగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు. ఒక బ్రూవరీ, హార్డ్‌వేర్ స్టోర్ గిడ్డంగులు, ఒక రైల్వే స్టేషన్ ఇతర మౌలిక సదుపాయాలపై దాడి జరిగిందని ఆయన చెప్పారు. “శత్రువుల మరిన్ని దాడుల ప్రమాదం కొనసాగుతున్నందున, సహాయక సిబ్బంది అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు,” అని ఉక్రెయిన్ రాష్ట్ర అత్యవసర సేవా విభాగం తెలిపింది. “భూమిపై నుండి ప్రయోగించే కచ్చితత్వంతో కూడిన ఆయుధాలు సుదూర దాడి డ్రోన్‌లను ఉపయోగించి మాస్కో సైన్యం భారీ దాడి చేసింది,” అని ఉక్రెయిన్ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Russia-Massive-Attack అందుకే ఈ దాడి.. రష్యా వెల్లడి
తమ సైన్యం “భూమిపై నుండి ప్రయోగించే కచ్చితత్వంతో కూడిన ఆయుధాలు సుదూర దాడి డ్రోన్‌లను ఉపయోగించి భారీ దాడిని ప్రారంభించింది” అని మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ,తెలిపింది. ఈ దాడి “రవాణా, లాజిస్టిక్స్ పంపిణీ కేంద్రాలపై” జరిగిందని, అవి “వివిధ ఆయుధాలు సైనిక సరుకుల నిల్వ పంపిణీలో, అలాగే మానవ రహిత వైమానిక వాహనాల ఉత్పత్తి పంపిణీలో పాలుపంచుకున్నాయి” అని పేర్కొంది. కొన్ని అధునాతన బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయగల ఏకైక రక్షణ వ్యవస్థ పేట్రియాట్‌ల కోసం, అమెరికాలో తయారైన ఇంటర్‌సెప్టర్‌ల కొరతను ఉక్రెయిన్ ఎదుర్కొంటోంది.
Russia-Massive-Attack జూలై .నెల భీతావహం
నాలుగేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, జూలైలో ఉక్రెయిన్‌లో రష్యా దాడుల్లో కనీసం 377 మంది పౌరులు మరణించగా, 2,129 మంది గాయపడ్డారు. ఏప్రిల్ 2022 తర్వాత అక్కడ జరిగిన దండయాత్రలో ఇదే అత్యంత ఘోర నెలగా నిలిచింది.
గత నెల చివరలో, ఉక్రెయిన్ తన సొంత పేట్రియాట్ క్షిపణి ఇంటర్‌సెప్టర్‌లను నిర్మించుకోవడానికి అనుమతించడానికి తాను సంకోచిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు – ఈ ఆలోచనను ఆయన గత నెల టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మొదటిసారిగా ప్రకటించారు. ఉక్రెయిన్ రాత్రికి రాత్రే రష్యాపై తన సొంత దాడిని ప్రారంభించింది, తుల ఓబ్లాస్ట్‌లోని మరో వైల్డ్‌బెర్రీస్ సార్టింగ్ సెంటర్‌పై దాడి చేసిందని స్థానిక గవర్నర్ తెలిపారు. రెండు అపార్ట్‌మెంట్ భవనాలు మరియు ఇతర పారిశ్రామిక సదుపాయాలకు కూడా నష్టం వాటిల్లినట్లు నివేదించబడింది.
బుధవారం ఒక కారు పేలుడులో గాయపడిన రష్యన్ రక్షణ సంస్థ డైరెక్టర్‌ను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచినట్లు రష్యన్ ప్రభుత్వ మీడియా నివేదికలు తెలిపాయి. ఉపైర్ డ్రోన్‌లుగా పిలిచే కామికాజీ రష్యన్ డ్రోన్‌లను ఉత్పత్తి చేసే యురాల్ డ్రోన్ ప్లాంట్ సీఈఓ వ్లాదిమిర్ త్కాచుక్, రష్యాలోని పశ్చిమ-మధ్య స్వెర్డ్లోవ్స్క్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో గాయపడ్డారని, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని రష్యా అధికార ప్రతిక తెలిపింది. హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారని అత్యవసర సేవల వర్గాలను ఉటంకిస్తూ ఆర్ఐఏ నోవోస్తి నివేదించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, జూలై చివరి వారంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు షెల్లింగ్ కారణంగా ఆస్తి నష్టంతో పాటు, కనీసం 61 మంది మరణించగా, మరో 327 మంది గాయపడ్డారు దక్షిణ రష్యాలోని రద్దీ బీచ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ శకలాలు పడి కనీసం ఏడుగురు మరణించారని మాస్కో చెప్పిన తర్వాత, రాత్రిపూట ఈ దాడులు జరిగాయి. ఒక రోజు తర్వాత, ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంలో ఒక కూరగాయల వ్యాపారిని రష్యా డ్రోన్ వెంబడించి, ఒక వాహనం చుట్టూ తరుముతూ పేలిపోయిన షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి గాయపడినప్పటికీ, దాడి నుండి ప్రాణాలతో బయటపడ్డాడు.
