టీడీపీ ఇంటింటి ప్రచారంతో జగన్ వైసీపీ దుకాణం క్లోజే : ప్రత్తిపాటి

  • సూపర్-6తో చంద్రబాబు ప్రజల మనసులు గెలిచారుః.
  • కూటమి ప్రజా విజయాలు. అభివద్ధి, సంక్షేమం ఓర్వలేకే జగన్ డీఎస్సీపై బురదజల్లుతున్నాడు
  • ప్రజా ప్రభుత్వ అద్భుత విజయాలపై ప్రజల్లో చైతన్యం వస్తే.. స్ఝానిక ఎన్నికల్లో కూటమి విజయాలకు తిరుగుండదు
  • పట్ణణంలో టీడీపీ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రత్తిపాటి.

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : రెండేళ్లలో చంద్రబాబు నాయకత్వంలో కూటమిప్రభుత్వం సాధించిన అద్భుత విజయాలపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేదుకు, జగన్..వైసీపీ విషప్రచారాన్ని తిప్పికొట్టేందుకే టీడీపీ ఇంటింటి ప్రచారం చేపట్టిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

మంగళవారం రాత్రి ఆయన పట్టణంలోని 10, 19 వార్డుల్లో టీడీపీ డోర్ టూ డోర్ ప్రచారం చేపట్టారు. కూటమి నాయకులతో కలిసి ప్రజల ఇళ్లకు వెళ్లిన ప్రత్తిపాటి..ప్రజా ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టం, ముందుచూపు, అనుభవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ల అసమాన పాలనా సంస్కరణలు తోడవడం నిజంగా రాష్ట్రానికి, ప్రజలకు గొప్ప వరమని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించినా, ప్రజలపై లక్షల కోట్ల పన్నులభారం మోపినా, ప్రధాని మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ దేశంలో లేని అభివృద్ధి, సంక్షేమాన్ని నిత్యం ప్రజలకు పంచుతున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

సూపర్-6 పథకాలతో చంద్రబాబు ప్రజల మనసులు గెలిచారు

పేదలో సేవలో పేరిట సామాజిక పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, దీపం-2, స్త్రీ శక్తి, అన్న క్యాంటీన్లు సహా పలు సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు దేశానికే మార్గదర్శిగా నిలిచి, ప్రజల మనసులు చూరగొన్నారని ప్రత్తిపాటి తెలిపారు..

జగన్.. వైసీపీ మంచిని ఓర్వలోకే.. డీఎస్సీపై దుష్ప్రచారం

మంచిని, అభివృద్ధిని ఓర్చుకోలేని ఏకైక రాజకీయ నాయకుడు ప్రపంచంలో జగన్ ఒక్కరేనని, రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనా విజయాలు, తిరుగులేని అభివృద్ధి, సంక్షేమంపై ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. ఐదేళ్లు డీఎస్సీ అమలు చేయకుండా, జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను దారుణంగా మోసగించిన జగన్, సిగ్గులేకుండా.. మెగా డీఎస్సీతో 16,348 ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చిన లోకేశ్ కృషిని తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

45 రోజుల టీడీపీ ఇంటింటి ప్రచారాన్ని పార్టీశ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని,, కూటమి పార్టీల ఐక్యత, ఆత్మీయతను సమగ్రంగా వివరించాలన్నారు. టీడీపీ జోష్ తో త్వరలోనే జగన్ వైసీపీ దుకాణాన్ని శాశ్వతంగా మూసేస్తాడని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. డీఎస్సీలో ఎంపిక కాని అభ్యర్థుల్ని జగన్ తన విష ప్రచారానానికి వాడుకుంటున్నాడన్నారు. జగన్ అలాంటి అభివృద్ధి నిరోధకుడు. అవినీతి పరుడు. ప్రజానాయకుడు లోకేశ్ రాజీనామాను కోరడం సిగ్గుచేటన్నారు.

కరపత్రాల పంపిణీతో సరిపెట్టకుండా, ప్రభుత్వ విజయాలపై ప్రజల్ని చైతన్యం చేస్తేనే స్థానిక పోరులో కూటమి హావా కొనసాగుతుంది..
ఇంటింటికి తెలుగుదేశంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అంతులేని అభిమానం, ఆదరణ స్పష్టంగా కనిపిస్తున్నాయని, పార్టీ శ్రేణులు కరపత్రాలతో సరిపెట్టకుండా కూటమి రెండేళ్ల విజయాల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో సాంకేతికత, సమర్షతతో ప్రచార హోరు పెంచాలని ప్రత్తిపాటి టీడీపీ శ్రేణులకు సూచించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్,రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు అమర రమాదేవి ముల్లా కరిముల్లా, మండవ వెంకట రావు,, షేక్ అజారుద్దీన్, షేక్ అబ్దుల్లా భాష, షేక్ అబ్దుల్ మజీద్, మజారుద్దీన్, జానీ భాష, ధరియవలి, కరిముల్లా, యేసుదాసు, రమేష్, శివయ్య, అబ్దుల్ రెహమాన్, బాజీ, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.