బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కు అందజేత
విద్యుత్ షాక్తో మృతి చెందిన రాజేందర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం
కడెం, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా నష్టపరిహార చెక్కును మంగళవారం కడెం మండలంలోని కొండుకూరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
గత ఏడాది విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన సంఘం రాజేందర్ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారం మొత్తానికి సంబంధించిన చెక్కులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కడెం శాఖకు మండల విద్యుత్ శాఖ అధికారి ఏఈ ఎం. రాంసింగ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అందజేశారు.
విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం, మృతుడు సంఘం రాజేందర్ భార్య సంగం నీరజకు రూ.50 వేల నగదు చెల్లించారు.
అలాగే, రాజేందర్ కుమారుడు మాస్టర్ సంగం యశ్వంత్ పేరుపై రూ.2.25 లక్షలను ఐదేళ్ల కాలపరిమితితో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. రాజేందర్ కుమార్తె సంగం వీణ్మయికి రూ.2.25 లక్షలు అందజేసినట్లు ఏఈ ఎం. రాంసింగ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి, నాయకులు ముస్కు భూమారెడ్డి, తిరుపతి రెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
