పచ్చదనమే భవిష్యత్తుకు భరోసా
టేకుమట్ల, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) అజ్మీర వసంత రామ్ అన్నారు. మంగళవారం గర్మిళ్లపల్లి గ్రామంలోని ఉర్దూ ప్లాంటేషన్‌లో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమాన్ని ఆయన మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం అవసరమని పేర్కొన్నారు.
మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా ప్రతి పౌరుడు తీసుకోవాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దిలీప్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి నిమ్మల బిక్షపతి, ఏపీఓ, ఈసీ, ఫీల్డ్ అసిస్టెంట్, వేజ్ సీకర్స్ తదితరులు పాల్గొన్నారు.
