అబ్దుల్ కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి..

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
డీఆర్‌డీఎల్, ఇస్రో నుంచి అణు పరీక్షల వరకు..
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు


(పాయికాపురం, ఆంధ్రప్రభ) : కష్టపడి పనిచేస్తే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా చేరుకోవచ్చనడానికి దేశ మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక గొప్ప కేస్ స్టడీ అని , సెంట్రల్ నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. అబ్దుల్ ​కలాం వర్ధంతిని పురస్కరించుకుని సింగ్ నగర్‌లోని మల్లాది విష్ణు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తగా డీఆర్‌డీఎల్, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో కలాం అందించిన సేవలు అపారమైనవని గుర్తుచేశారు. చారిత్రాత్మక పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతం చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారన్నారు. దేశ రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చేసిన సేవలకు గానూ పద్మవిభూషణ్, దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించాయని తెలిపారు. పట్టుదల, కార్యదీక్షతో ముందడుగు వేయడానికి దేశంలోని, రాష్ట్రంలోని యువత అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజానికి, దేశానికి స్ఫూర్తిగా నిలిచిన ఆ మహనీయుని బాటలోనే ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, సుందర్ పాల్, కుక్కల రమేష్, శ్రీరాములు, రవి చంద్ర, గుడిసె శ్యామ్, జి ప్రసాద్, చంటి, రామిరెడ్డి, రాజారెడ్డి, ప్రేమ్, యర్రంశెట్టి వెంకన్న మేడ రమేష్, షేక్ ఇస్మాయిల్, అలీ, రాము, మహమ్మద్ ఇస్మాయిల్, సిద్ధ బత్తుల రమణ, షేక్ భాషా, జవ్వాది సుధీర్, శోభన్, హరేంద్రర్, మురళి, నాగేంద్ర, రఫీ, కరిముల్లా వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.