AP | కృష్ణా జిల్లాలో నారా లోకేష్ ర్యాలీ..
AP | పెనమలూరు – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పర్యటనకు విచ్చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు టిడిపి నేతలు ఘన స్వాగతం పలికారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్‌కు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము తదితరులు. స్వాగతం పలికారు.

ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు నుంచి పునాదిపాడుకు భారీ ర్యాలీగా బయలుదేరిన మంత్రి లోకేష్, ర్యాలీలో పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అడుగడుగున పసుపు జెండాలతో సాదర స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం తెలియజేస్తూ నారా లోకేష్ ముందుకు సాగారు. ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన మంత్రి నారా లోకేష్, కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.


