ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన అభినవ్‌కు కేటీఆర్ భరోసా
సిరిసిల్ల, ఆంధ్రప్రభ: సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్ ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను సోమవారం అభినవ్, ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలత కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభినవ్‌ను శాలువాతో సత్కరించిన కేటీఆర్, ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద ల్యాప్‌టాప్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, అభినవ్ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కాలేజీ ఫీజును తానే భరిస్తానని, చదువులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
