వడాలిలో టీడీపీ డోర్-టు-డోర్ కార్యక్రమానికి శ్రీకారం..
నాయకులకు వీరమల్లు నరసింహారావు దిశానిర్దేశం
కైకలూరు, ఆంధ్రప్రభ : ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో టీడీపీ డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు ప్రారంభించారు. ఈసందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అలాగే పార్టీ సందేశాన్ని ప్రతి కుటుంబానికి చేరవేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు.
