సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: గరికపాటి శివ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఇబ్రహీంపట్నం మండల టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి గరికపాటి శివ అన్నారు. సోమవారం కేతనకొండలో 45 రోజులపాటు నిర్వహించనున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ పథకాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పత్రి లేపాక్షిరావు, కొమ్మూరు గోపాలరావు, చలపతిరావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
