ఆ దారి.. ఆరు రోజులు..
న్యూ శాయంపేట, ఆంధ్రప్రభ: గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ పరిధిలోని న్యూ శాయంపేట రైల్వే గేట్ వద్ద రైలు ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మొత్తం ఆరు రోజుల పాటు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ సమయంలో న్యూ శాయంపేట–భట్టుపల్లి మధ్య ప్రయాణించే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
గేట్ మూసివేతతో ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మామిడ్ల రాజు స్పందిస్తూ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
