ఆషాడ మాసంలో ఉత్సవాలకు ముస్తాబైన తోట్ల ఎల్లమ్మ
వికారాబాద్, (ఆంధ్రప్రభ): ఆషాడ మాస ఉత్సవాల కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి తోట ఎల్లమ్మ ప్రాంతంలో గల శ్రీ ఎల్లమ్మ దేవత ముస్తాబయింది. ఆలయ అర్చకులు ఎల్లమ్మ దేవతను వేప కొమ్మలతో పూలతో అలంకరించారు. ఆషాడ మాస మంగళవారం కావడంతో వికారాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఎల్లమ్మ దేవతను దర్శించుకుంటున్నారు. శ్రీ తోట్ల ఎల్లమ్మ ఆలయం రోజురోజుకు అభివృద్ధి సాధిస్తుంది. ఎర్నే పలికి వచ్చిందా జగ్గరీ రత్నారెడ్డి తదితరులు ఈ ఆలయం అభివృద్ధి కోసం ఎoత గానో కృషి చేశారు.
