మొక్కలు నాటి సంరక్షించాలి: బాసర సీఐ దీపక్
బాసర (ఆంధ్రప్రభ): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని బాసర సీఐ దీపక్, కీర్గుల్ (కే) గ్రామ సర్పంచ్ మధుప్రీతి పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ జిల్లా బాసర మండల పరిధిలోని కీర్గుల్ (కే) గ్రామంలో వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ దీపక్, సర్పంచ్ మధుప్రీతి మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, వ్యవసాయ చేలు, పొలాల్లో మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యత కాపాడటంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శ్యాముల్, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
