హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌కు నూతన రూపు

జూలై 17న మోదీ వర్చువల్ ప్రారంభం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌కు ఆధునిక హంగులు అద్దారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ.26 కోట్ల వ్యయంతో స్టేషన్‌ను పూర్తిస్థాయిలో పునరాభివృద్ధి చేశారు. ఈ ఆధునికీకరించిన స్టేషన్‌ను జూలై 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

పునరాభివృద్ధి పనుల్లో భాగంగా ప్రయాణికుల కోసం అత్యాధునిక స్టేషన్ భవనం, 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. అలాగే అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల రాకపోకలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.

హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు ప్రధాన ద్వారంగా నిలిచే హైటెక్ సిటీ స్టేషన్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. కొత్త సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.