ముద్రగడ పద్మనాభం మృతిపై చంద్రబాబు, పవన్‌ సంతాపం

అమరావతి, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మరణవార్త తనను కలచివేసిందని పేర్కొన్న చంద్రబాబు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

పవన్ కల్యాణ్ సంతాపం

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూయడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.