రూ.1.5 కోట్లతో నిర్మిస్తున్న ఎంపీడీఓ భవనం..

  • ప్రారంభ దశలోనే నిలిచిన పనులు!

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండల కేంద్రంలో సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎంపీడీఓ కార్యాలయ భవనం నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. పునాదులు, పనులు చేపట్టిన అనంతరం నెలలుగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో నిర్మాణ సామగ్రి తుప్పు పట్టి, ప్రాంగణం కలుపు మొక్కలతో నిండిపోయింది.

కొత్త భవనం పూర్తయితే ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందుతాయని ఆశించినప్పటికీ, పనులు నిలిచిపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం ఎందుకు నిలిచిపోయిందో సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.