భువనగిరి రోడ్డు వెడల్పు పై కమిషనర్ కు వినతి..
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల నుంచి భువనగిరి వరకు చేపడుతున్న రహదారి విస్తరణ పనులు ఎన్ని అడుగుల వెడల్పుతో చేపడుతున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం చిట్యాల మున్సిపల్ కమిషనర్ యు. గురులింగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రహదారి విస్తరణపై ప్రజల్లో అయోమయం నెలకొన్నందున పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు నిమ్మనగొట్టి శ్రీనివాస్, ఎస్కే అజీముద్దీన్, జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్‌రెడ్డి, కందాటి రమేష్‌రెడ్డి, ఆగు అశోక్, బొలుగురి సైదులు, ఆవుల ఆనంద్, జిట్ట కృష్ణ, ఉప్పలపల్లి నగేష్, జిట్ట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
