ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంపీడీవో

నడిగూడెం (ఆంధ్రప్రభ): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నడిగూడెం ఎంపీడీవో మల్సూర్ నాయక్ మంగళవారం రామాపురం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని సూచించారు.

బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సవరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నామ నరసింహారావు, బీఎల్‌వోలు తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.