పీజీఆర్ఎస్లో ఉత్తమ సేవలు..
డీఆర్డీఏ పీడీ సింగయ్యకు కలెక్టర్ సత్కారం
బాపట్ల, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బి. సింగయ్యను జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ సోమవారం ఘనంగా సత్కరించారు.
పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందజేసిన ఫిర్యాదుల పరిష్కారంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు ఆయనకు మెమెంటో, శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారి ప్రవర్తనకు 91.75 శాతం, సక్రమ విధానాల అమలుకు 94.85 శాతం, అర్జీదారులకు సరైన సమాచారం అందించడంలో 95.88 శాతం మార్కులు సాధించిన బి. సింగయ్య, మొత్తం పనితీరు ఆధారంగా జిల్లా స్థాయిలో తొలి స్థానంలో నిలిచారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఇదే స్ఫూర్తితో సేవలు కొనసాగించాలని బి. సింగయ్యను అభినందించారు.
