6 రోజులు కూనారం రోడ్ రైల్వేగేటు మూసివేత

  • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలి
  • దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి రైల్వే యార్డు సమీపంలోని లెవల్ క్రాసింగ్ నెం.39 వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మతుల పనుల కారణంగా పెద్దపల్లి–కూనారం రైల్వే గేటును ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. ట్రాక్ మరమ్మతుల పనుల కారణంగా తాత్కాలికంగా రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, ప్రజలు సహకరించాలని కోరారు. మరమ్మతుల పనుల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.