NEWS@5:00 P.M | 13 జూలై 2026 ముఖ్యాంశాలు

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ బెడ్‌రోల్ కిట్‌ను అందిస్తుంది. ఇందులో బెడ్‌షీట్, దుప్పటి, దిండు, దిండు కవర్, తువ్వాలు వంటి వస్తువులు ఉంటాయి. ప్రయాణం ముగిసిన తర్వాత వీటిని తిరిగి రైల్వే సిబ్బందికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే కొందరు ప్రయాణికులు ఈ నిబంధనను పట్టించుకోకుండా వాటిని తమతో తీసుకెళ్తుండటంతో భారతీయ రైల్వేకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. బహుశా కొందరు… “టికెట్‌తో పాటు దుప్పట్లు, టవల్ లు కూడా ఫ్రీ” అనుకుంటున్నారేమో!

ఆ యువతిది హత్యనా? బలవన్మమరణమా?.. ఆమె మరణంపై పలు అనుమానాలు. అన్నింటికీ ఆధారం నేర పరిశోధనలో సేకరించిన ఆధారాల శాస్త్రీయంగా విశ్లేషించి ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికార్లు ఇచ్చే నివేదికనేనా అంటే అవునని మేధావులు అంటున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన పంజాల మౌనిక(29) ఆదివారం సాయంత్రం ఇంట్లో మృతి చెందింది. ఆమె మృతిపై తల్లిదండ్రుల కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ భర్త,అత్తమామలు గుట్టుచప్పుడు కాకుండా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ‌ మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో మేనమామ ఊరు కొత్తూరు మండలం పింజర్ల గ్రామంలో అతని మృతదేహం లభ్యమయింది. రాజ్ కుమార్ మృతదేహం పక్కన పురుగుల మందుల బాటిల్ ఉన్నట్లు సమాచారం.

డయల్ 100 ద్వారా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని చూసి రాజ్ కుమార్ గా గుర్తించారు. మొత్తం మీద సైకో కిల్లర్ రాజ్ కుమార్ హతమయ్యాడు. కిరాతకుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

అయోధ్య శ్రీరామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర‌ ప్రభుత్వం, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు సోమవారం నోటీసులు జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది.

ఎల్‌బీనగర్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ అనుచరుల మధ్య సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ నిరసనలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఒక వైపు మరో విజయంతో నయా చరిత్ర సృష్టించటానికి మెస్సీ గ్యాంగ్​,, అదే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా,, ఎట్టి పరిస్థితిలో.. గోల్డెన్​ బూటుతో పాటు.. గోల్డెన్​ బాల్​ ;పట్టేయాలని.. అతడే ప్రాన్ష్​ సాకర రణ సారధి కిలియన్​ ఎంబాపే.. స్పెయిన్​ సూపర్​ సబ్​ అస్త్రం .. లాస్ట్​ మినిట్​ మిరాకిల్​ హీరో మెరీనో మైకెల్గం, ఒకరు కాదు ఇద్దరు స్ట్రయికర్లు హారీకేన్​..జూడ్ బెల్లింగ్‌హామ్ బలంతో ఇంగ్లండు జట్టు .. కోటి ఆశలతో ఫిఫా టోర్నీ సెమీ ఫైనల్స్​ లో తలపడుతున్నాయి.

CLICK HERE TO READ THE FULL STORY