Odisha | భర్త మృతి..
Odisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒడిశాలోని బలాంగీర్ జిల్లాలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. భార్య మొబైల్ ఫోన్‌తో తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స అనంతరం మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. దంపతుల మధ్య జరిగిన గొడవ సమయంలో భార్య మొబైల్ ఫోన్‌తో భర్త తలపై బలంగా కొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు చికిత్స అందించిన అనంతరం అతడిని డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి చేరిన కొద్దిసేపటికే అతడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం స్పష్టమవుతాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
