పాడి రైతుల పిల్లలకు పాలడైరీ స్కాలర్‌షిప్‌లు..
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలంలోని పాడి రైతుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కరీంనగర్ పాలడైరీ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. పాలడైరీకి పాలు సరఫరా చేస్తున్న రైతుల పిల్లలకు విద్యా ప్రోత్సాహకంగా ఈ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల గ్రామానికి చెందిన కేడిక మాధుసూదన్ రెడ్డి, పాలడైరీ మేనేజర్ సుధాకర్, సైట్ సూపర్‌వైజర్ ధన్‌రాజ్ పాల్గొని విద్యార్థులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతుల పిల్లలు ఉన్నత విద్యలో ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలకు విద్యా సహాయం అందించడం తమ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. కార్యక్రమంలో పాడి రైతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
