Road Accident | సీసీటీవీలో రికార్డైన విషాదం

Road Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతివేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ బాలుడు యాక్టివాపై వెళ్తున్న ఇంటర్ విద్యార్థినిని బలంగా ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

స్థానికులు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక మరే ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.