Mancherial | యువతి ఆత్మహత్య

Mancherial | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడనే ఆరోపణల నేపథ్యంలో మాధవి అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

యువతిని వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగి ప్రేమ పేరుతో వేధించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు వారు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. యువతి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.