దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ పట్టణంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఊర పండుగ వేడుకల్లో సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముక్కోటి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భీమ్‌గల్ ప్రాంత ప్రజల్లో అధిక శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ప్రస్తుతం వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.