అశోక్ సాగర్ చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలోని అశోక్ సాగర్ చెరువు కట్ట సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. జానకంపేట గ్రామానికి చెందిన మహిళ ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి పూర్తి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన ఇతర సమాచారం తెలియాల్సి ఉంది.
