రోడ్డు ప్రమాదంలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టు రాజు దంపతులకు తీవ్ర గాయాలు
కన్నాయిగూడెం, జూలై (ఆంధ్రప్రభ): కన్నాయిగూడెం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి దినపత్రిక జర్నలిస్టు రాజు, ఆయన భార్య లక్ష్మీ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సింగారం పల్లె ప్రకృతి వనం సమీపంలో బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా పశువులు రోడ్డుపైకి రావడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో లక్ష్మీ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు రిఫర్ చేశారు. రాజుకు కూడా గాయాలయ్యాయి. ఘటనపై స్థానిక జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజు దంపతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
