ఆరుగురిని హత్య చేసిన ఆగంతకుడు..
భార్య, ఇద్దరు పిల్లలను ఒక గ్రామంలో..
తనపై కేసు పెట్టిన కుటుంబాన్ని మండల కేంద్రంలో హత్య చేసి పరారైన వ్యక్తి..
షాబాద్: జులై 11 (ఆంధ్రప్రభ) రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఆరుగురి హత్య కేసు సంచలనం రేపింది. తనపై కేసు పెట్టిన కుటుంబాన్ని అలాగే తాను కట్టుకున్న భార్య, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు చిన్నారులను హత్య చేశాడు.
షాబాద్ మండలం దైవాలకు చెందిన రాజ్ కుమార్ గత కొన్ని సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన సరిత అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. అతడు భార్య పిల్లలతో మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. ఇంటి పక్కనే ఉన్న మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించడంతో బాలిక తల్లి షాబాద్ పోలీసులకు మే 16న ఫిర్యాదు చేసింది. షాబాద్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. రెండు నెలలుగా అతడు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు.
శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో షాబాద్ కు వచ్చి తనపై కేసు పెట్టిన లక్ష్మిని హత్య చేశాడు. అడ్డువచ్చిన లక్ష్మి అత్త రుక్కమ్మను హత్య చేసి బాలికను తీసుకెళ్లాడు. తన సొంత గ్రామమైన దైవాలగూడ సమీపంలోని చెరువులో ఆ బాలికను హత్య చేశాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి భార్య సరిత, కుమారులు పరీక్షిత్, పృధ్వాన్ష్ లను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
హంతకుడు తన తండ్రికి ఫోన్ చేసి నేను ఆరుగురిని హత్య చేశాను.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపి పోలీసు స్విచ్ ఆఫ్ చేసి వెళ్లినట్లు సమాచారం. అంతకుముందు తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఆరు శవాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఫ్యూచర్ సిటీ సి పి, డీసీపీ చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
