49వ డివిజన్‌లో పడకేసిన పారిశుధ్యం
కాల్వ లోని చెత్త తీయడానికి బదులు మెట్ల కు వేసిన సిమెంట్ దిమ్మెల క్రింద కు తోసేన్న వైనం
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం 49 వ డివిజన్ ప్రైజర్ పేట టైలర్ పేట లో పారిశుద్ధ్య పనులు నిర్వహణ గురించి చాలా ఫిర్యాదు లు స్థానికులు చెబుతున్నారు. 49 వ డివిజన్ కొండ ప్రాంతం లో శానిటరీ సిబ్బంది కొన్ని వీధి లో అసలు చెత్త తీయటం లేదని అని స్థానికులు అంటున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 49 వ డివిజన్ ఈరు ప్రకాశం వీధి మొదటి లో గత మూడు రోజులుగా కాల్వ తీరలేదని సైడ్ కాల్వ ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిన ఉంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సైడ్ కాల్వ లో పేరుకుపోయిన చెత్తాచెదారం తీయడానికి బదులు కాల్వ పై నడవడానికి వేసిన మెట్ల క్రింద తోసేస్తున్నారు.
దాంతో అసలు చెత్తాచెదారం తీయకపోయినా ఎవరికి తెలియదు. అసలే వర్షా కాలం మొదలైంది. కాల్వలో వ్యర్ధాల తొలగించకపోతే దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు ప్రబలడానికి అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. మా వీధి లో కాల్వ తీయటం లేదని ఎవరైనా స్థానికులు అడిగితే సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారు అని స్థానికులు అంటున్నారు. 49 వ డివిజన్ లో ఎంత మంది శానిటరీ సిబ్బంది కి ఎంత మంది విధులకు హాజరు అవుతున్నారు అనే విషయం ఉన్నతాధికారులు తెలుసుకోవాలి అని స్థానికులు కోరుతున్నారు. ప్రతి రోజూ శానిటరీ సిబ్బంది విధులు నిర్వహించే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
